భార్యలు కొడుతున్నారు.. కాపాడండి సార్లూ - MicTv.in - Telugu News
mictv telugu

భార్యలు కొడుతున్నారు.. కాపాడండి సార్లూ

November 20, 2017

ఉత్తరప్రదేశ్‌లో భార్యల వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నట్టున్నాయి. ఈ సంవత్సర కాలంలో 6,646 మంది భర్తలు తమను తమ భార్యల నుండి రక్షించాలని డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేశారు. పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం. భర్తల వేధింపుల నుండి రక్షించాలని లక్షా యాభై మూడు వేల ఫిర్యాదులు అందాయని పోలీసులు చెప్తున్నారు.భార్యలు రోజూ తమను చితకబాదుతున్నారని పోలీసులకు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, గోరఖ్‌పూర్, కాన్పూర్, అలహాబాద్, ఆగ్రాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి.  భర్తల నుండి భార్యలపై ఫిర్యాదులు అందుకోవడం గతంలో కంటే ఈ ఏడాది పెరిగిందని లెక్కలు చెప్తున్నట్టు పోలీసులు అంటున్నారు.

ఉత్తరప్రదేశ్ పోలీసులు డయల్ 100పై వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఏడు లక్షలకు పైగా కుటుంబ కలహాల క్రమంలో ఫిర్యాదులను స్వీకరించినట్టు పోలీసులు చెప్తున్నారు. ఫిర్యాదుదారులు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా వున్నట్టు విశ్లేషించారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ కలహాలు  ఉన్నా పోలీస్ స్టేషన్ వరకు రావడంలేదనేది చెప్పారు.