mictv telugu

విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా.. బాలకృష్ణ చిన్నల్లుడు..

February 13, 2019

రాబోయే ఏపీ ఎన్నికలకు వివిధ పార్టీలు కార్యాచరణలు సిద్ధం చేసుకుంటున్నాయి.  ఈక్రమంలో ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారో, కొత్తగా ఎవరు పార్టీల్లో చేరుతారో ఊహించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు  శ్రీ భరత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. శ్రీభరత్‌కు ముందునుంచీ రాజకీయ వారసత్వం వుంది. టీడీపీ సీనియర్ నేత, దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి భరత్‌కు తాతే అవుతారు.

Telugu news Will contest as MP from Visakhapatnam. Balakrishna second son in law..

బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తాతగారి ఆశయాలు, ఆలోచనలతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా జీవితంలోకి వస్తున్నాను. పార్టీ ఆదేశిస్తే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తా. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తున్నారు. ఏపీలో రాజధాని అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయగల సమర్ధత నాయకుడు చంద్రబాబు అని ప్రజలు నమ్ముతున్నారు’ అని శ్రీ భరత్ పేర్కొన్నారు. చూడాలి మరి శ్రీభరత్ అభ్యర్థనపై టీడీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో. Telugu news Will contest as MP from Visakhapatnam. Balakrishna second son in law