mictv telugu

కేజ్రీవాల్‌కు రాజకీయాల్లో ఇంత ముక్కుసూటితనం పనికొస్తుందా..

January 10, 2019

మన దేశంలోని కమ్యూనిస్టులకు ఆల్టర్‌నేట్ ఎవరంటే  అనే పేరు మరోసారి గుర్తుకు తెచ్చారు ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్. లోక్‌సభలో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు గురించి ఆయన పార్టీ తీసుకున్న స్టాండ్ గురించి యావత్ దేశం గమనించింది. దళిత నాయకులు  మాట్లాడిన మాటలు విన్న తర్వాత తానే స్వయంగా ఈ బిల్లు గురించి గురించి, బీజేపీ అసలు ఆలోచనలు తెలుసుకున్న తర్వాత తాను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నానని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఈ దేశ రాజకీయాలను అర్థం చేసుకుని మాట్లాడుతున్న అతి కొద్ది మందిలో కేజ్రీవాల్ ఒకరు. ధర్నాలు చేసినా, కేంద్ర ప్రభుత్వంపై  తీవ్ర నిరసన వ్యక్తం చేసినా అది ప్రజాస్వామ్య యుతంగానే ఉంటుందని దేశ ప్రజలకు చేసి చూపించిన ముక్కుసూటి నాయకుడు.Telugu news Will Kejriwal be able to make such a move in politics?ఢిల్లీ వంటి కాస్మో పాలిటన్ సిటీకి పరిమితం అయిన పార్టీ నాయకుడు. దేశ రాజధానిలో ఉంటున్న నాయకుడు యావత్ దేశంపై ప్రభావం చూపించే నాయకుడు  తన అభిప్రాయాన్ని చాలా స్ట్రెయిట్‌గా చెప్పారు. దళిత నాయకుడు జిగ్నేష్ మేవాని ఈబీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. దళితలకు ఇస్తున్న కులాధారిత రిజర్వేషన్లను ఎత్తేయడానికి  జరుగుతున్న కుట్రగా ఈబీసీ రిజర్వేషన్లను ఆయన అభివర్ణించారు. జిగ్నేష్‌తో తాను ఏకభవిస్తున్నానని చెప్పారు కేజ్రీవాల్.

ఈబీసీ రిజర్వేషన్ల మూలాల గురించి  వివిధ పార్టీల నాయకులు భిన్నంగా స్పందించారు. ప్రధాన స్రవంతి  పార్టీల్లో ఏఐడీఎంకే మాత్రమే భిన్న స్పందనను తెలియజేసింది. అదీ  ఇంత హడావిడి ఎందుకూ అని చెప్పింది. ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీ మాత్రం చాలా  సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పింది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన ఉద్దేశ్యం ఏదైనా కావొచ్చు. తొలుత తాను  ఈబీసీ రిజర్వేషన్లకు మద్దతునిచ్చానని, ఆ తర్వాత అభిప్రాయాన్ని మార్చుకున్నానని చెప్పారు.

కేజ్రీవాల్ తీసుకుంటున్న నిర్ణయాలు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీంలు ఇవన్నీ కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాల మోడల్‌కు దగ్గరగా ఉన్నాయని విమర్శకులే అంటున్నారు. ఓట్ల కోసం కాకుండా ఒక రాజకీయ పార్టీగా తన  అభిప్రాయాన్ని ఈ రోజుల్లో అందునా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఇంత క్లారిటీతో చెప్పడం మామూలు విషయం కాదు.

నిజంగానే  కేజ్రీవాల్ విషయంపై స్పష్టత ఉన్న నాయకుడు.

ఓట్ల కోసం, సీట్ల కోసం ఎన్ని దారుల్లో అయినా అధికారాన్ని చేజిక్కించుకోవాలంటున్న ఈ రోజుల్లో కేజ్రీవాల్ లాంటి నాయకుడు ఉండటం, మాట్లాడటం అరుదైన విషయమే మరి. అయితే  అగ్రకులాల్లో పేదలున్న మాట వాస్తవం. వారిని ఆదుకోవాలనే రిజర్వేషన్లు పెట్టడం మంచిదే. కాకపోతే ఎస్సీలకు రిజర్వేషన్లే లేకుండా చేయాలనే బీజేపీ కుట్రపూరిత ఆలోచనను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. పార్లమెంట్‌లో బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన  మాట్లాడారు. వాస్తవానికి రిజర్వేషన్లతో కొంత ఉపశమనం ఉండొచ్చునేమో కానీ. కులం పీడితులకు అవకాశాలు లేకుండా నిజంగానే బీజేపీ కుట్రపూరిత ఆలోచనే అయితే ముందు ముందు ఆ పార్టీనే కాదు దేశంలోని దళితులు, దేశమూ పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు.