2019లో ముఖ్యమంత్రి అవుతానంటే చేసేస్తారా ? - MicTv.in - Telugu News
mictv telugu

2019లో ముఖ్యమంత్రి అవుతానంటే చేసేస్తారా ?

March 7, 2018

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ అందర్నీ కలుపుకుని హోదా ఉద్యమాన్ని భుజాన వేసుకుందామంటే మిగిలినవారు ఆఖరివరకూ నిలబడతారన్న నమ్మకం దొరకటం లేదు. కేంద్రంతో సయోద్యతతో ఉంటే తప్పులేనప్పుడు.. మరో తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సయోధ్యతతో ఉంటే తప్పేంటి ? కాంగ్రెస్ చేసి‌న తప్పును సరిచేసుకోవటానికే నిన్నటి రాహుల్ గాంధీ హోదాపై తొలి సంతకం ప్రకటన చేశారు ’ అన్నారు పవన్ కల్యాణ్.అహ్మదాబాద్‌లో మోదీని కలసినప్పుడు హోదాను విస్మరించవద్దని తాను కోరినట్టు తెలిపారు. 1969 నుంచి ఏపీ తెలంగాణ పరిస్థితులను కూడా మోదీకి వివరించానని.. హోదాను అన్ని పార్టీలు స్వప్రయోజనాల‌ కోసం వాడుకుంటున్నాయని మండిపడ్డారు.

రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను సరిచేయాల్సి‌న బాధ్యత కేంద్రం మీదే వుంది.. పరిశోధనలో తేలిన అంశాలను అవగాహన చేసుకుంటున్నాను.. ఈనెల 14న పార్టీ ఆవిర్భావసభలో జనసేన భవిష్యత్ ప్రణాళికలను ప్రకటిస్తానని పేర్కొన్నారు. టీడీపీ నుంచి కేంద్రంలో మంత్రులు ఎప్పుడో రాజీనామా చేసి ఉండాల్సింది అన్నారు.    ‘ టీడీపీ వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో చాలా బలంగా పోరాటం చేస్తారని భావించాను. 2019లో నేను ముఖ్యమంత్రి అవుతానంటే ప్రజలు చేసేస్తారా ? మాఫియా మాట ఇస్తే నిలుపుకుంటోంది కానీ.. నాయకులు మాట ఇస్తే నిలుపుకోవటం లేదు ’ అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.