మైనింగ్ డాన్ గాలి జనార్దన రెడ్డికి బీజేపీ టికెట్! - MicTv.in - Telugu News
mictv telugu

మైనింగ్ డాన్ గాలి జనార్దన రెడ్డికి బీజేపీ టికెట్!

March 28, 2018

అక్రమ మైనింగ్‌ కేసులో నిందితుడు, వ్యాపారవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. బీజేపీ టికెట్‌పై గాలి బళ్లారి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గాలి  పోటీ చేస్తున్నట్టు ఆయన తమ్ముడు సోమశేఖర్ రెడ్డి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై గాలి జనార్థన్ రెడ్డి ఇంకా స్పందించలేదు. అటు పార్టీనుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అన్నదమ్ములిద్దరూ భాజాపాలోనే వున్నామని చెప్తున్నారు. కానీ పార్టీ మౌనంగా వుండటం వెనుక రహస్యం ఏంటన్నదాని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మే 12న రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగన్నాయి. ఇవి అధికార కాంగ్రెస్‌, విపక్ష బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఇప్పటికే రెండు పార్టీలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి.