మెగా ఫ్యాన్స్ కు శ్రీరెడ్డి మెగా కౌంటర్.. - MicTv.in - Telugu News
mictv telugu

మెగా ఫ్యాన్స్ కు శ్రీరెడ్డి మెగా కౌంటర్..

April 23, 2018

నటి శ్రీరెడ్డి మరోమారు పవన్ ఫ్యాన్స్‌పై  తన ఫేస్‌బుక్ వాల్‌పై సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ఫ్యాన్స్ అంటూ ఎవరికి వారు చేస్తున్న రచ్చ మీద శ్రీరెడ్డి ఓ వివరణ ఇచ్చింది. ‘విమానం హైజాక్ అయినప్పుడు అందులో మా హీరో వున్నాడు మమ్మల్ని కాపాడుతాడులే అనుకుంటారు మీలాంటి వాళ్ళు..  ఆ హీరో కూడా మీరే వాళ్ళను కాపాడతారులే అనుకుని అందరిలా గుండెలు అదిరించుకుంటూ అందులో వుంటాడు’ అని.. అదీ తెలుగు సినిమా హీరోలా రియల్ హీరోయిజం అని కళ్ళకు కట్టినట్టు కొన్ని ఉదాహరణలు చెప్పింది శ్రీరెడ్డి. కులం రంగు పులుముకున్న హీరోలను మోస్తున్న అభిమానులారా ఆ హీరోలు మీకు చేసేదేమీ వుండదు.. మీ కుటుంబాల కోసం శ్రమించండి అని పిలుపునిచ్చింది. శ్రీరెడ్డి పోస్ట్.. ఉన్నది ఉన్నట్టుగా..‘‘దగ్గర దగ్గర 28 శాతం విస్తరించి ఉన్న ఒక సామాజిక వర్గం, కులాభిమానం మెండుగా ఉండి అది తలకెక్కి ఆ ఒక్క కుటుంబం బాగుంటే మేము బాగున్నట్టే అనుకొని ఒక పిచ్చి భ్రమలో బతుకుతున్నారు.

మా కులం లో ఒక గొప్ప హీరో ఉన్నాడు, మిగిలిన ఇంకో సామజిక వర్గానికి ధీటైన పోటీ ఇచ్చాడు, మా పరువు నిలుపుతున్నాడు…. అనుకుంటూ ఒంటి మీద చొక్కా, కాలికి జోళ్ళు ఉన్నాయో లేదో చూసుకోకుండా 30 ఏళ్లుగా ఆ ఒక్క కుటుంబాన్ని మోస్తున్నారు…. ఏం ఒరిగింది మీకు ??

ఆ కుటుంబం అద్దె ఇంటి నుండి డాబాకి , ఆడ నుండి మేడలోకి ఆపై రాజ భవనం లాంటి ఇళ్ళ లోకి మారి భుజాన మోస్తున్న మిమ్మల్ని గేటు దగ్గరే ఆపేసారు. అందులో మీకు వచ్చింది మా కులంలో ఒక పెద్ద హీరో ఉన్నాడు అని ఒక ఫాల్స్ ‘క్యాస్ట్ ప్రైడ్’ అంతే.

ఆ కులాభిమానం వీక్నెస్‌ని….ఆ కుటుంబం క్యాష్ చేస్కొని… ఆయన కుటుంబం నుండి ఇప్పటికి 8 మందిని హీరోస్‌ని చేసి మీ మీదకి వదిలాడు. మీకు వచ్చింది ఏం ఉంది అందులో ??

ఆ యబ్బి బ్లడ్ బ్యాంకు పెట్టి ….రక్తం నువు ఇస్తే పబ్లిసిటీ తను చేస్కున్నాడు….. ఐ బ్యాంకు పెట్టి కళ్ళు నువ్వు దానం చేస్తే ఆయన గొప్పతనంగా ప్రమోట్ చేస్కున్నాడు ..! అందులో నీకు వచ్చింది ఏం ఉంది ??

ఆ తరువాత…..రాజకీయాల్లోకి వచ్చి నీ భుజాన పార్టీ జెండా పెట్టి…. టికెట్స్ తను అమ్ముకొని సొమ్ము చేస్కున్నాడు….. కొడుక్కి ‘రోల్స్ రాయీస్’ లాంటి ఖరీదైన కార్లు కొన్నాడు….. నీకు ఏం పెట్టాడు….. చేతిలో చిప్ప తప్ప ..!

294 లో ఒక పది టికెట్స్ అయినా 3 దశాబ్దాలుగా ఆయన్ని మోస్తున్న ఫాన్స్ ప్రెసిడెంట్స్‌కి అయినా ఇచ్చాడా ?? లేదు డబ్బు సంచులతో ఎవడు వస్తే వాడికే ఇచ్చాడు.

కలెక్షన్స్ బాగా దండుకొని అంతా అయ్యాక పార్టీ మూసేసి…. నన్ను అమాయకుణ్ణి చేసి ముంచేసారని మొసలి కన్నీళ్ళు కారిస్తే…..నువ్వు పెడ బొబ్బలు పెట్టావ్…. మా అన్న మంచోడు చుట్టూ చేరి ముంచేసారని ..!

ఎన్టీఆర్ గారు అదే సినిమా ప్రపంచం నుండి వచ్చి…. పార్టీ పెట్టి తన ఫాన్స్ ప్రెసిడెంట్స్‌గా ఉన్న శ్రీపతి రాజేశ్వర్, నెల్లూరు రమేష్ రెడ్డి, బి వి మోహన్ రెడ్డి…… లాంటి వాళ్ళకి టికెట్స్ ఇచ్చి గెలిపించి మంత్రుల్ని చేసాడు. మరి ప్రజలు లేని ఒక రాజ్యం అనే పార్టి పెట్టినా ఆ అన్న ఏం చేసాడు ??

ఇవ్వాళ తమ్ముడు….. ఇంకో పార్టి పెట్టి కొత్త అవతారం ఎత్తాడు. పార్టి పెట్టి ….పెట్టక ముందే ఒక మంచి ప్యాకేజీ కుదుర్చుకుని ప్రీ ప్రొడక్షన్‌లో పార్టి ఉండగానే టేబుల్ ప్రాఫిట్ చూసాడు.

మహా తెలివిగలోడు. ఎంత తెలివి అంటే ఒక మనిషి తనని తిడితే మా తల్లిని తిట్టింది అని నిమ్మళంగా నాలుగు రోజులాగి దానిని రాజకీయం చేసి , మీడియా మీద బురద జల్లి దాంట్లో కొంచెం ప్రత్యర్ది పార్టీకి పూసి తను పెట్టబోయే కొత్త ఛానల్‌కి ప్రమోట్ చేస్కునేంత తెలివిగలోడు…..

అసలు చెప్పిన నిజాలు నీకు ఒప్పుకోవడానికి మనసొప్పదు….. సరే నేను ఒకటి అడుగుతా చెప్పు…… 30 ఏళ్లుగా NO 1 ఉంటూ సగానికి పైగా థియేటర్స్ కంట్రోల్‌లో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఉన్న ఆ పెద్ద మనిషి… ఒక్క నటుడి నైనా మీ కులంలో నుండి హీరో గా రమ్మని గాని……. వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయడం గాని జరిగిందా ??

లేదు….. ఆయన కుటుంబంలోనే డజను మందిని దింపి …..నీ భుజాన మోపాడు. ఏం మీ కులంలో ఆ కుటుంబం తప్పించి హీరోస్ అయ్యే అర్హత ఇంకెవరికి లేదా ??

అదే సినిమా ప్రపంచం లో ఇంకో కులం కూడా ఉంది…. 3 శాతం కూడా లేని…..ఆ కులం నుండి 30 రకాల కుటుంబాలు బోలెడు డైరెక్టర్స్…….బొచ్చెడు మంది హీరోస్ ఉన్నారు. మరి 30 శాతం ఉన్న మీ కులం ఉండి ఆ కుటుంబం తప్పించి ఇంకోకళ్లని ఆ కుటుంబం ఎందుకు తీసుకు రావట్లేదు….. అదే వ్యాపారం అంటే మీ కులానికి తానే ప్రతినిధిని అని చెప్పుకుంటూ చేసే మోనోపోలీ బిజినెస్ అది.

ఏనాడైనా మీరు బాగా చదువుకుని బాగుపడండిరా….మా వెనక తిరగొద్దు ….అన్నారా?

తెలుసుకో……. ఇప్పటికైనా కళ్ళు తెరువు……. టికెట్స్ కోసం సిగపట్లు పట్టి ……చిరిగినా చొక్కా తెగిన జోళ్ళు చూసుకో.

కులం మాటున చేసే ఆ బానిస మనస్తత్వం వదిలి నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించు….. ఒళ్ళు వంచి కష్టపడు అపుడు రిజర్వేషన్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు.

నిన్న కూడా సరిగ్గా వయసు కూడా రాని కుర్రోళ్ళు…..ఫాన్స్ పేరుతో….టీవీ వాహనాలు పగలగొట్టారు…..ఓ వ్యక్తిని….పోలీసు చొక్కా పట్టుకుని లాక్కెళ్లడం కూడా చూసాం….వాళ్ళు వచ్చారా….

సమయం అంత ఆ కుటుంబం తీసిన సినిమాలు…..పెట్టిన పార్టీలు….. ఇచ్చిన పిలుపులకి స్పందిచటానికి ఖర్చు పెడితే నీ భార్య బిడ్డలకి ఏం తెచ్చి పెడతావ్……ఎలా పోషిస్తావ్ ??

కొంతమంది నా ప్రాణ మిత్రులు…సోదరులు…. ఫాన్స్‌గా చెప్పుకుంటూ ‘క్యాస్ట్ ప్రైడ్’ తో కాలర్ ఎగరేసే చాలా మందిని చూసి జాలి వేసి రాయాలి అనిపించి రాసా ..!

ఇక ఏం చేయదలుచుకున్నారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా…