వాట్సాప్ కొత్త ఫీచర్..  నంబర్లు ఈజీగా మార్చుకోవచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ కొత్త ఫీచర్..  నంబర్లు ఈజీగా మార్చుకోవచ్చు

March 30, 2018

ఆండ్రాయిడ్‌​ బీటా యూజర్ల కోసం వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో యూజర్లు తమ వాట్సాప్ నంబర్లను ఈజీగా మార్చుకోవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నంబర్‌కు డేటాను కూడా బదిలీ చేసుకోవచ్చు. దీనికోసం యూజర్లు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌లో  ‘చేంజ్‌ నంబర్‌’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

ఈ ఆప్షన్‌లో పాత, కొత్త ఫోన్‌ నంబర్లను ఇన్‌సర్ట్‌ చేశాక, మీ కొత్త నంబర్‌కు ఏ కాంటాక్ట్‌లను నోటిఫై చేయాలో వాట్సాప్‌ కోరుతుంది. కొత్త నంబర్‌లోకి మారిన తర్వాత, పాత చాట్‌లో ఉన్న షేర్డ్‌ మెసేజ్‌లు‌, కొత్త దానిలోకి మరలుతాయని.. చాట్‌ హిస్టరీని కొత్త చాట్‌లోకి మార్చుకోవచ్చని, డూప్లికేట్‌ చాట్‌లను డిలీట్‌ చేసుకోవచ్చని డబ్ల్యూబీటా ఇన్ఫో ట్విటర్‌లో తెలిపింది.

ఈ కొత్త ‘చేంజ్‌ నంబర్‌’ ఫీచర్‌ అప్‌డేట్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌లోని  2.18.97 ఆండ్రాయిడ్‌ బీటా అప్‌డేట్‌కు అందుబాటులో ఉంది. అనంతరం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌, విండోస్‌ డివైజ్‌లకి కూడా అందుబాటులోకి రానుంది.