భారీగా తగ్గిన ఇంటర్నెట్ ధరలు.. - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా తగ్గిన ఇంటర్నెట్ ధరలు..

March 30, 2018

2016లో రిలయన్స్‌ జియో దెబ్బకు ఇంటర్నెట్ రేట్లు కుదేలయ్యాయి. 2014 – 2017 మధ్య ఇంటర్నెట్‌ రేట్లు 93 శాతం వరకు  తగ్గినట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం(డీవోటీ) ట్విటర్‌లో పేర్కొంది. తక్కువ రేట్లకు ఇంటర్నెట్ టారీఫ్‌లు అందిస్తుండగా ఇంటర్నెట్‌ రేట్లు భారీగా క్షీణించాయి. దీంతో ఈ మూడేళ్లలో డేటా వాడకం 25 సార్లకు పైగా పెరిగినట్టు తెలిపింది. జియో ఎప్పుడైతే మార్కెట్‌లోకి వచ్చిందో అప్పటినుంచి టారిఫ్‌ రేట్ల తగ్గింపు మరింత ఎక్కువైందని పేర్కొంది. ఈ కంపెనీ ఒక్కో జీబీని రోజుకు అత్యంత తక్కువగా 4 రూపాయలకే అందిస్తోంది. 

ఇదిలా వుండగా అత్యంత చౌకైన టారిఫ్‌ గ్లోబలీ- 2014లో ఒక్కో జీబీకి 33 రూపాయలుంటే, 2017 సెప్టెంబర్‌లో ఒక్కో జీబీకి 21 రూపాయలుందని వెల్లడించింది. అంటే మొత్తంగా 93 శాతం వరకు టారిఫ్‌ తగ్గింపు ఉన్నట్టు డీవోటీ తెలిపింది. మొబైల్‌ ఇంటర్నెట్‌ రేట్లు తగ్గడంతో, డేటా వాడకం పలు సార్లు పెరిగినట్టు తెలిసింది. ఒక్కో సబ్‌స్క్రైబర్‌ సగటు డేటా వాడకం 25 సార్లు పెరిగిందని డీవోటీ ట్వీట్‌ చేసింది.

2014 – 2017 మధ్య చాలా తేడా వచ్చిందని చెప్పింది. 2014లో ఒక్కో నెలలో 62జీబీ వాడకముంటే, 2017లో ఒక్కో నెలలో 1.6జీబీ వాడకముందని తెలిపింది. ప్రపంచంలోనే  భారత్‌లో అ‍త్యధికంగా ఒక్కో నెలలో 1.3 మిలియన్‌ జీబీ నమోదవుతున్నట్టు డీవోటీ పేర్కొంది. ఇది అమెరికా, చైనాలలో వాడే డేటా వాడకం కంటే చాలా ఎక్కువ. బ్రాడ్‌బ్యాండ్‌ యాక్సస్‌ యూజర్లు కూడా 2014 మార్చిలో 61 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లుంటే, 2017 సెప్టెంబర్‌లో 325 మిలియన్ల సబ్‌స్క్రైబర్లకు పెరిగినట్టు వెల్లడించింది. ట్రాయ్‌ డేటా ప్రకారం 2017 డిసెంబర్‌ చివరి నాటికి ఇంటర్నెట్‌ సబ్‌స్క్రైబర్లు 445.9 మిలియన్లకు ఎగిసినట్టు తెలిసింది. 

మరోవైపు దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వాడకం 190 మిలియన్‌ నుంచి 390 మిలియన్లకు పెరగడంతో ఇంటర్నెట్‌ యూజర్లు కూడా 66 శాతం పెరిగినట్టు డీవోటీ తెలిపింది. 2014-17 మధ్యకాలంలో ఇంటర్నెట్‌ యూజర్లు 251 మిలియన్ల నుంచి 429 మిలియన్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది.