నడుంపై ప్యాంటే సరిగ్గా ఉండదు.. అక్కచెల్లెళ్లను కాపాడతాారా? - MicTv.in - Telugu News
mictv telugu

నడుంపై ప్యాంటే సరిగ్గా ఉండదు.. అక్కచెల్లెళ్లను కాపాడతాారా?

March 8, 2018

రాజస్థాన్ మహిళe కమిషన్ చైర్మన్ సుమన్ శర్మ నేటితరం అబ్బాయిల వస్త్రధారణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నడుం నుంచి మాటిమాటికీ జారిపోయే ప్యాంట్లు వేసుకునే అబ్బాయిలు తమ అక్కాచెల్లెళ్లను ఎలా రక్షిస్తారని సటైర్లు వేశారు. బట్టలే సరిగ్గా వేసుకోని వాళ్లు ఆడపిల్లను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు.మహిళాదినోత్సవం సందర్బంగా జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.. అలాగే అమ్మాయిలను కూడా హెచ్చరించారు. అమ్మాయిలు స్వేచ్చ పేరుతో హద్దులు దాటొద్దని సూచించారు. ‘అమ్మాయిల్లో జీరో సైజ్ ఇవాళ  పెద్ద స్టేటస్‌గా భావిస్తున్నారు. మరి అబ్బాయిలకేమైంది? అమ్మాయిళ్లా చెవిపోగులు ఎందుకు పెట్టుకుంటున్నారు?’ అని అన్నారు. విశాలమైన ఛాతీ, దానిపై దట్టంగా వెంట్రుకలుండే మగాళ్లను మహిళలు ఎక్కువగా ఇష్టపడేవారని, కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయని, ఆడ ఎవరో, మగ ఎవరో తెలియకుండా పోతోందని పేర్కొన్నారు.