గాజుల రామారంలోని గని గుంతలో దూకిన యువతి! - MicTv.in - Telugu News
mictv telugu

గాజుల రామారంలోని గని గుంతలో దూకిన యువతి!

February 15, 2018

మేడ్చేల్ జిల్లా గాజులరామారంలో ఉన్నక్వారీ గుంతలో ఓ మహిళ  దూకింది.  అక్కడే ఉన్న కొందరు కార్మికులు  గుంతలో దూకి ఈత కొట్టుకుంటూ వెళ్లి ఆమెను కాపాడడానికి ప్రయత్నించారు. కానీ బయటకు తీసుకు రావడానికి ముందే ఆమె చనిపోయింది.

 గుంతకు ఇవతల రోడ్డుపై ఉన్నవారు ఆ మహిళ దూకుతున్నప్పుడు  వీడియో తీశారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎందుకు  ఆత్మహత్య చేసుకోబోయింది ?అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలుసులు దర్యాప్తు  చేస్తున్నారు.  కుటుంబంలో ఉన్న కలహాలవల్లే  ఆ యువతి ఆత్మహత్య చేసుకుందేమోనని  పోలీసులు భావిస్తున్నారు.  ఇదే గుంతలో గత కొన్ని నెలల వ్యవధిలోనే  ఇంకో నలుగురు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు.