జుట్టే..ఆమె పాలిట యమపాశమయ్యింది ! - MicTv.in - Telugu News
mictv telugu

జుట్టే..ఆమె పాలిట యమపాశమయ్యింది !

February 16, 2018

ఆడవాళ్లకు జుట్టే పంచ ప్రాణాలు అంటారు. కొందరికైతే జుట్టు ఊడిపోతుంటే ప్రాణం పోయినంత పని అవుతుంది. కానీ హర్యాణాలో ఓ మహిళ ప్రాణాన్ని ఆమె జుట్టే తీసింది. హర్యానాలోని భాటిండాకు చెందిన పునీత్ కౌర్(28) భర్త పిల్లలతో కలిసి పార్క్‌కు వెళ్లింది.  అక్కడ ఫ్యామీలీతో సరదాగా గడిపింది. ఆతర్వాత  కుటుంబ సభ్యులందరూ 4 గో కార్ట్ కార్లను ఎక్కి రైడ్ చేయాలనుకున్నారు. పునీత్ కౌర్ కార్లో ఎక్కి  రైడ్ చేస్తుండగా.. ఆమె వెంట్రుకలు గాలికి ఒక్కసారిగా లేచి టైర్‌కు చుట్టుకున్నాయి.కొన్ని సెకన్ల కాలంలోనే ఆమె తల మీదున్న మొత్తం వెంట్రుకలతో పాటు చర్మం ఊడి టైర్లలో చుట్టుకుంది. వెంటనే ఆమెను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ తల మీద చర్మం పూర్తిగా ఊడిపోవడంతో తీవ్రంగా రక్తం పోవడంతో.. ఆమె చనిపోయింది. ఇదిలా ఉంటే  పార్క్  మేనేజ్ మెంట్ నిర్లక్ష్యం వల్లే  ఆమె చనిపోయిందని వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.