జియోకు నాంది ఆమెనే - MicTv.in - Telugu News
mictv telugu

జియోకు నాంది ఆమెనే

March 16, 2018

జియో నెట్ వర్క్ వచ్చి రెండు సంవత్సరాలకు పైనే  అయ్యింది. మొదట మూడు నెలల పాటు అన్ లిమిటెడ్ కాల్స్ మరియు డేటా అందించి అందరినీ ఆకట్టుకుంది.  ఆ తర్వాత తక్కువ ధరకే డేటాను, కాల్స్ ను అందిస్తుంది. జియో దాటికి అన్ని నెట్ వర్క్ లు కూడా ఫ్రీ ఆఫర్లను ప్రకటించక తప్పలేదు.  కొన్ని నెట్‌వర్క్‌లైతే జియో ధాటికి కంపెనీలను మూసుకోవాల్సిన పరిస్థితి.అయితే  ఇంతటి సంచలనాలకు కారణమైన జియో నెట్ వర్క్ ఆలోచన  తన కూతురిదేనని ముఖేష్ అంబాని స్పష్టం చేశారు. జియోకు డ్రైవర్స్ ఆఫ్ చేంజ్’ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా  ముఖేష్ ఈ విషయాన్ని మీడియాలో పంచుకున్నారు. ‘నా కూతురు ఇషా 2011 లోని జియోకు విత్తనం వేసింది. ఆ సమయంలో ఆమె అమెరికాలోని యూనివర్సిటీలో చదువుకుంటోంది. అయితే  సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు ఆమె జియో నెట్ వర్క్ గురించి తన అభిప్రాయాలను మాతో పంచుకునేది.ప్రపంచంలో ఉన్నతమైన దానిని అందించడానికి దేశ యువతరానికి చెందిన ఇషా, ఆకాశ్‌లు ఎక్కువ సృజనాత్మకంగా, అతిపెద్ద లక్ష్యంతో ఉన్నారు. జియోను  ప్రారంభించడానికి నా పిల్లలే నన్ను ఒప్పించారు. వాళ్ల చొరవతోనే జియో నెట్ వర్క్ వచ్చింది’ అని ముఖేష్ అన్నారు.​ 2019 నాటికి భారత్‌ లీడర్‌గా జియో నిలవబోతుందని అంబానీ అన్నారు.