ప్రియుణ్ని చంపి, వర్కర్లకు వండిపెట్టింది... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియుణ్ని చంపి, వర్కర్లకు వండిపెట్టింది…

November 21, 2018

మానవజాతిలో ఓర్పు, సహనం, మానవత్వం నానాటికీ  పూర్తిగా క్షీణిస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు. చంపడం మాత్రమే కాకుండా చనిపోయిన వారి మృతదేహాలపైనా వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.Telugu news women chopped her lover and cooked a dish with his flesh Moroccan woman cooked murdered lover's body for meal, say prosecutorsదుబాయ్‌లో నివసిస్తున్న ఒక మొరాకో దేశస్తురాలు ప్రేమికుడితో ఏడేళ్లుగా కలిసి జీవిస్తోంది. అంతా సజావుగా సాగుతోంది. త్వరలో తనను పెళ్లి చేసుకోకుంటాడని ఆ ప్రేయసి ఆశించింది.  ఇంతలోనే సదరు ప్రేమికుడు ఆమెకు ఒక చేదు వార్త వినిపించాడు. ‘సారీ అమ్మడూ.. నువ్వంటే నాకు ప్రేమే. అయితే పెళ్లి చేసుకోలేను. నా మరదల్ని పెళ్లి చేసుకుంటాను.. ’ అని తెగేసి చెప్పాడు. దీంతో ఆమె అగ్గిమీద గుగ్గిలమైంది. ఏడేళ్లు తనతో ప్రేమాయణం నడిపి, చివరికి నట్టేట ముంచేస్తావా అంటూ ఆక్రోశించింది. అయినా అతడు కరగలేదు. మోసపోయిన ప్రియురాలు పక్కా పథకం వేసి ప్రేమికుణ్ని హతమార్చింది. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బిర్యానీ వండింది. చుట్టుపక్కల పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన గృహ నిర్మాణ కూలీలను ఆహ్వానించింది. అది  మొరాకో ప్రత్యేక వంటకమని అబద్దం చెప్పి వారికి వడ్డించింది. వారు కూడా లొట్టలేసుకుని తినేశారు. వండటానికి వీలు కాలు పెద్ద భాగాలను ఆవిడగారు కుక్కలకు పడేసింది. మూడు నెలల కిందట ఈ దారుణం జరిగింది.

తమ్ముడు రాకపొతే ఎప్పటికి తెలిసేది కాదు..

మృతుడి  సోదరుడు అతడి ఆచూకీ వెతుకుంటూ రాకపోతే  ఈ ఘోరం బయటి ప్రపంచానికి తెలిసేదే కాదు. అన్న కోసం వచ్చిన ఆ సోదరుడిని సదరు నరహంతకి బయటి నుంచే పంపించేసింది. ఆ కుర్రాడు అనుమానంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశాడు. పోెలీసు ఆమె ఇంటికెళ్లి తనిఖీ చేయగా మిక్సీ బ్లెండర్‌లో మనిషి పన్ను దొరికింది. దానికి డీఎన్ఏ పరీక్ష చేయగా అసలు విషయం బయటపడింది. నిందితురాలని విచారించగా నేరం అంగీకరించింది.