ఎంతపని చేశావు తల్లీ… వారసుణ్ణి కనాలని అనంత లోకాలకు..

2018లో కూడా ప్రజల్లో ఇంకా మగ సంతానంపై యావ చావడంలేదు. ప్రభుత్వాలు ఎంత చైతన్యం తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నా వారసుడి కోసం ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మగ సంతానానికి జన్మనివ్వలేదని ఎందరో ఆడవాళ్లను రోడ్డున పడేసిన సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. మగ బిడ్డ కోసం ఐదారు సార్లు గర్భం దాల్చి మరణించిన ఆడవారిని చూశాం. గుంటూరులో జరిగిన సంఘటన కూడా అలాంటిదే. కానీ ఇక్కడ మగ సంతానం యావ చూపింది తల్లి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.Telugu News Women lost her life while giving birth to 6th childగుంటూరులో ఒక మహిళకు వరుసగా ఐదుగురు ఆడపిల్లలు కలిగారు. అయినా కూడా ఆమె మగ సంతానం కోసం మరోమారు గర్భం దాల్చింది. ఆరోసారి కూడా ఆడబిడ్డే జన్మించింది. అయితే ప్రసవిస్తున్న సమయంలో అధిక రక్తస్రావం జరగడంతో తల్లీబిడ్డలు ఇద్దరూ మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే…గుంటూరులో స్థానికంగా ఎస్సీ కాలనీలో ఉంటున్న చిలుకూరి మేరీ సునీత, నాగేశ్వర్రావుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. నాగేశ్వరరావు రిక్షా కూలీగా పనిచేస్తున్నాడు. ప్రసన్న, ప్రేమవతి, చంద్రిక, సాగరమ్మ, మరియమ్మ అనే ఐదుగురు కుమార్తెలు పుట్టారు. అయితే అబ్బాయి పుట్టలేదని… కొడుకుని కనాలంటూ పట్టుబట్టింది సునీత. ఈ క్రమంలో మరోసారి గర్భవతి అయ్యింది. బంధువులు,భర్త వద్దని వారించినా వినిపించుకోలేదు. సోమవారం రోజు సునీతకు పురిటి నొప్పులు రావడంతో గురజాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించారు. అక్కడ ప్రసవిస్తూ అధిక రక్తస్రావంతో తల్లి బిడ్డలు ఇద్దరు మరణించారు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.