21 మందిలో ఎవడూ నచ్చలేదు.. 70 వేలు వాపస్ - MicTv.in - Telugu News
mictv telugu

21 మందిలో ఎవడూ నచ్చలేదు.. 70 వేలు వాపస్

October 3, 2018

నచ్చిన వరుడిని చూపిస్తామని ఆమెకు హామీ ఇచ్చింది ఓ సంస్థ. కానీ అది వెతికి పట్టుకున్న వరుళ్లలో ఎవరూ ఆవిడకు నచ్చలేదు. హామీని తుంగలో తొక్కిందంటూ ఆ సంస్థకు ఫిర్యాదు చేసింది సదరు వరాన్వేషిణి. దీంతో సదరు సంస్థ యువతికి రూ.70 వేల చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన చండీగఢ్‌కు చెందిన యువతి (27) తనకు వరుడు కావాలని ఓ ప్రైవేటు వెబ్‌సైట్‌లో 12నెలల ప్లాన్ రిజిస్టర్ చేసుకుంది.

Marriage Matrimonial Company Fail Matchmaking For Women In Chandigarh.

ఇందుకోసం ఆ యువతి రూ.58,650 చెల్లించింది. దీంతో ఆ సంస్థ ఆమెకు 21 సంబంధాలు చూపించింది. వాటిలో యువతికి ఒక్క సంబంధం కూడా నచ్చకపోవడంతో.. సదరు సంస్థపై జూలై 30, 2016న ఫిర్యాదు చేసింది. అదేవిధంగా తాను చెల్లించిన నగదు తిరిగివ్వాలని ఆ సంస్థ వెబ్‌సైట్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో సంస్థ యాజమాన్యం అసలు రూ.58,650తో కలిపి రూ,7,000 పరిహారం, రూ. 5,000 కేసుతో కలిపి మొత్తం రూ.70,000 యువతికి చెల్లించింది. కాగా సంస్థ నిర్వహించిన మీటింగ్‌లకు యువతి ఏ రోజు రాలేదని ఆ సంస్థ ఆరోపించింది. అంతేకాదు ఆమె తాము కాల్స్ చేసినా.. మెసేజ్‌లు చేసిన స్పందించేది కాదని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.