స్మార్ట్‌ఫోన్ వాడితే గర్భస్రావం! - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్‌ఫోన్ వాడితే గర్భస్రావం!

December 19, 2017

స్మార్ట్ ఫోన్లను వాడే మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ  శ్రద్ద తీసుకోవాలని అమెరికాకు చెందిన కెజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసర్చ్ పరిశోధకులు తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు,మైక్రోవేవ్, వైపై రౌటర్ల నుంచి  ఎక్కువగా రేడియేషన్ వెలువడుతుంది. ఆ రేడియేషన్‌ వల్ల  గర్బస్రావం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయస్కాంత క్షేత్రాల  నుంచి వెలువడే రేడియషన్ వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువని  చెప్పారు. మరోవైపు క్యాన్సర్ వ్యాధులను కనిపెట్టే  సరికొత్త రక్త పరీక్ష‌ను జార్జియా స్టేట్  యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. తెల్ల రక్త కణాల క్యాన్సర్, మెలనోమా అనే చర్మ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌ను ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపితో  కనిపెట్టవచ్చని తెలిపారు. అంతేకాకుండా మూత్రపిండల వ్యాధితో బాధపడేవారికి, మధుమేహం వచ్చే ముప్పు ఉందని తాజా పరిశోధనల్లో తెలిసింది. ఇప్పటివరకు మధుమేహంతో  కిడ్నీ పాడవుతుందని తెలుసు. కానీ మూత్ర పిండాలు సరిగ్గా పని చేయకపోతే రక్తంలో యూరియా శాతం పెరిగి మధుమేహ వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.