mictv telugu

నా చాంబర్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా.. రాజాసింగ్  

January 7, 2019

టీఆర్ఎస్ అధిష్ఠానం ప్రొటెం స్పీకర్‌గా మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌ను ఎంపిక చేయడంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విముఖత తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం పట్ల, హిందూ ధర్మం పట్ల గౌరవం లేని వ్యక్తులను ప్రొటెం స్పీకర్ స్థానంలో ఎలా కూర్చుండబెడతారని ప్రశ్నించారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ సమక్షంలో తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.

Telugu news Won’t take oath in assembly where MIM MLA is speaker, says Telangana BJP MLA

‘టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతలే లేనట్టు ముంతాజ్ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవడం నాకు నచ్చలేదు.  ప్రొటెం స్పీకర్ పదవి ముంతాజ్ ఖాన్‌కు ఇచ్చిన విషయం మీడియా ద్వారా తెలిసి చాలా బాధపడ్డాను. దేశం పట్ల, ధర్మం పట్ల మజ్లిస్‌కు గౌరవం లేదు. ‘భారత్ మాతాకీ జైై’, ‘వందేమాతరం’ పాడని అటువంటి పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్ పదవిని కట్టబెడతారా?  తెలంగాణ అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చిన తర్వాతే నా ఛాంబర్‌లో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను.

రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఎంఐఎం ఏవిధంగా గోహత్యలు చేయిస్తున్న విషయమై, దేశం, ధర్మం పట్ల వారు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడంపై నేను ఆందోళన వ్యక్తం చేశాను. అలాంటి ఎమ్మెల్యే ముందు నేను ప్రమాణ స్వీకారం చేయను’ అని స్పష్టంచేశారు రాజాసింగ్. ఇదిలావుండగా రాజాసింగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తెగ విమర్శలు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ కట్టింది ముస్లిమైన నిజామే కదా మరి అక్కడికి ఎలా వెళ్తావని, హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ముస్లిం రాజు కులీ కుతుబ్ షా కదా.. మరిక్కడ ఎలా వుంటారని కామెంట్లు చేస్తున్నారు.

Telugu news Won’t take oath in assembly where MIM MLA is speaker, says Telangana BJP MLA