మల్లీశ్వరి తర్వాత చానూనే.. భారత్‌కు గోల్డ్ మెడల్ - MicTv.in - Telugu News
mictv telugu

మల్లీశ్వరి తర్వాత చానూనే.. భారత్‌కు గోల్డ్ మెడల్

November 30, 2017

భారత వెయిట్‌లిఫ్టింగ్ మీరాబాయ్ చాను సంచలనం సృష్టించింది. 22 ఏళ్ల తర్వాత వరల్డ్‌వెయిట్ లిఫ్టింగ్  చాంపియన్‌షిప్‌లో  బంగారు పతాకం సాధించింది.  మహిళల 48 కేజీల కేటగిరిలో పోటీపడిన చాను ,స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీల బరువెత్తి మెుత్తంగా 184కేజీల నేషనల్ రికార్డును క్రియేట్ చేసింది.రియో ఒలింపిక్స్‌లో ఘెరంగా విఫలమైన చాను, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలించింది. చివరిసారిగా వరల్డ్ చాంపియన్ షిఫ్ లో 1994,1995లో వరుసగా కరణం మల్లీశ్వరి భారత్‌కు రెండు బంగారు పతకాలను సాధించింది. థాయ్‌లాండ్‌కు చెందిన సుక్ చరియోన్ తున్యా 193 కేజీలతో వెండి పతకం, 182 కేజీలతో సెగురా అనా కాస్యం పతకం సాధించింది.