ఇంటర్నెట్ ద్వారా గుండె సర్జరీ.. భారత వైద్యుడి ఘనత

వైద్యశాస్త్రంలో మరో ముందడుగు పడింది. ప్రపంచంలోనే తొలిసారిగా ఇంటర్నెట్ ద్వారా గుండెకు సర్జరీ చేశాడు ఓ భారతీయ వైద్యుడు. గుజరాత్‌కు చెందిన తేజ్ పటేల్ బుధవారం ఈ ఘనత సాధించాడు.

yyy

గాంధీనగర్‌ లోని అక్షర్‌ధామ్  స్వామి నారాయణ్‌ ఆలయం నుంచి ఆయన 32 కి.మీ.దూరంలోని రోగికి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశాడు. ప్రపంచంలోనే తొలి టెలీ రోబోటిక్‌ కరోనరీ సర్జరీగా ఇది రికార్డుకెక్కింది.హ్యూమన్ రోబోటిక్ ఇటర్‌వెన్షన్‌ విధానంలో తేజస్ రిమోట్‌ ద్వారా ఆపరేషన్‌ నిర్వహించారు. ఇంటర్నెట్, ఇతర అత్యాధునికి మెడికల్ వ్యవస్థలతో కూడిన రోబోటిక్‌ చేతిని ఆయన ఆలయం నుంచి పనిచేయించాడు. థియేటర్లోని సిబ్బంది.. సర్జరీని పర్యవేక్షించారు. డాక్టర్ రోబో చేతిని కదిలిస్తున్నప్పుడు సీఎం విజయ్ రూపానీ కూడా అక్కడే ఉండి ఆసక్తింగా గమనించారు.

ఆపరేషన్ జరిగిన మహిళలకు ఇదివరకు సాధారణ పద్ధతిలోనే సర్జరీ చేసి, గుండె రక్త నాళాల్లో పూడికను తీసేశారు. అయితే మరో రక్త నాళంలోనూ పూడిక రావడంతో టెలీ రోబోటిక్ విధానం ద్వారా దాన్ని తొలగించారు. వైద్యనిపుణులు అందుబాటులోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ విధానం ఉపయోగపడుతుందని తేజస్ పటేల్ చెప్పారు. తనకు దైవభక్తి ఎక్కువ అని, అందుకే ఆలయం నుంచి ఆపరేషన్ చేశానని తెలిపారు.

rr