కాళ్ళతో పరీక్ష రాశాడు.. శభాష్ శంకర్! - MicTv.in - Telugu News
mictv telugu

కాళ్ళతో పరీక్ష రాశాడు.. శభాష్ శంకర్!

March 15, 2018

పట్టుదల ముందు అంగవైకల్యం ఓడిపోతుంది అనటానికి ఇది నిలువెత్తు నిదర్శనం. రెండు చేతులు లేకపోయినా గుండెలో కొండంత ఆత్మవిశ్వాసం వుందిగా అని నమ్మిన విద్యార్థి ఎల్లూరి శంకర్. కాళ్ళనే చేతులుగా భావించి 10వ తరగతి పరీక్షలు కాళ్ళతో రాశాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శంకర్ కాళ్ళతో పరీక్ష రాసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.కాళ్ళూ చేతులు బాగున్నవారు నాకదిలేదు.. ఇదిలేదని దేనికోసమో వెంపర్లాడుతుంటారు. కానీ శంకర్ తనకు చేతులు లేకపోయినా బాధపడలేదు. చేతులను కాళ్ళలో చూసుకున్నాడు. చాలామంది తమకు అంగవైకల్యం వుండటం శాపంగా భావించి బాధపడుతుంటారు. కానీ శంకర్ అలా బాధపడలేదు. ఎవరిమీద ఆధారపడకుండా తనలోనే ప్రత్యన్మాయ మార్గాన్ని వెతుక్కున్నాడు. అంగవైకల్యం కూడా చదువుకు అడ్డుకాదని నిరూపించాడు. అతని పట్టుదల ముందు అంగవైకల్యం శిరసు వంచింది.