mictv telugu

ఎంఐఏ2 ఫోన్‌పై 3వేల భారీ తగ్గింపు

January 7, 2019

షావోమి ఎంఐఏ2 స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించనున్నట్టు ప్రకటించింది. ఇదే అతి పెద్ద హై ఫై (5) ప్రకటన అని షావోమి ఇండియా ట్వీట్‌ చేసింది.   ఎంఐఏ2 స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్లపై ఈ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ కలిగిన ఎంఐఏ2 ఫోన్  ఎంఆర్‌పీ ధర రూ.17,999 వుండగా, ఆఫర్ కింద రూ. 13, 999లకే అందిస్తోంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ అసలు ధర రూ. 20,500 వుండగా, ఆఫర్ కింద రూ. 15,999 లకే లభ్యమవుతోంది.

ఈరోజు మధ్యాహ్నం 12గంటల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అమెజాన్‌, ఎం.కామ్‌ అన్‌లైన్‌ స్టోర్లతోపాటు, ఎంఐహోమ్‌ ఆఫ్‌లైన్‌ ద్వారా   ఈ ఫోన్ల అమ్మకాలు జరుగుతాయి. షావోమి ఇలాంటి ఆఫర్లను  ఇంకా నాలుగు  ప్రకటించనుంది.

Telugu news Xiaomi is a huge reduction on the MIA 2 smartphone