స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీ ఉత్పత్తుల్లో మార్కెట్లను ఏలుతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ షావోమి ఈరోజు కొత్త ఎల్ఈడీ టీవీలను భారత విపణిలో విడుదల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 4కె పేరుతో వీటిని విడుదల చేసింది. వీటితోపాటు ఎంఐ సౌండ్ బార్నుకూడా ఆవిష్కరించింది. 20 వాట్ల స్టీరియో స్పీకర్లు, గూగుల్ వాయిస్ సెర్చ్, షావోమి సొంతమైన ప్యాచ్ వాల్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది. ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఈ టీవీలలో అందిస్తున్నారు. ప్లే స్టోర్, క్రోమ్ క్యాస్ట్‌కు సపోర్ట్, హాట్ స్టార్, హంగామా, సోనీ లివ్, వూట్, ఈరోస్ నౌ, జీ5, హూక్, ఎపిక్ ఆన్ వంటి యాప్‌లు ఇన్‌బిల్ట్‌గా ఈ స్మార్ట్ టీవీల్లో పొందుపర్చింది.43 ఇంచుల టీవీ ధర రూ.22,999 కాగా, 55 ఇంచుల టీవీ ధర రూ.39,999గా ఉంది. సౌండ్‌బార్ ధర రూ. 4999. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీలు విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ఫీచర్లు
55 అంగుళాల డిస్ప్లే, 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్టులు, డీటీఎస్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి.
ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ ఫీచర్లు
43 ఇంచ్ టీవీలో 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టులు ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి.
Telugu News Xiaomi Mi LED TV 4X Pro 55-inch, Mi TV 4A Pro 43-inch and Mi Soundbar launched Price in India and features