తొలి 5జీ ఫోన్ వచ్చేసింది.. ఎంఐ మిక్స్3 ఫీచర్లివే..

చైనా మొబైల్ ఫోన్ల కంపెనీ షావోమీ అదరగొట్టింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. 4జీలను దాటేసి, 5జీ ఫోన్ల తయారీ కోసం అటు అమెరికా, ఇటు యూరప్ కంపెనీలు కసరత్తులో మునిగి ఉండగా షావోమీ వాటికంటే  ముందే బయటికి తెచ్చి షాకిచ్చింది.

tt

5జీ వెర్షన్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ ‘ఎంఐ మిక్స్ 3’ను ఓ సదస్సులో ఆవిష్కరించింది  ఫోన్ పనితీరు, సామర్థ్యం, వెబ్ సర్ఫింగ్, లైవ్ వీడియో స్ట్రీమింగ్ వంటివి చాలా వేగంగా ఉన్నాయని డెమోతో వివరించింది. వాస్తావానికి 5జీ స్మార్ట్‌ఫోన్లు వచ్చే ఏడాది చివరి నాటికి వస్తాయని అంచానా వేశారు. దాన్ని తలకిందులు చేస్తూ ఏ ఏడాది చివరికే షావోమీ పట్టుకొచ్చింది. దీని బేసిిక్ మోడల్ ధర దాదాపు రూ. 35 వేల వరకు ఉంటుందని అంచనా

ఎంఐ మిక్స్3..  5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు

6.39 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 10 జీబీ ర్యామ్, 256 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, 12 ఎంపీ+12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 24 ఎంపీ +2 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్