షియోమీ బంపర్ ఆఫర్.. కస్టమర్లకు 500 కోట్లు వెనక్కి - MicTv.in - Telugu News
mictv telugu

షియోమీ బంపర్ ఆఫర్.. కస్టమర్లకు 500 కోట్లు వెనక్కి

November 30, 2017

చైనా కంపెనీ షియోమీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం ‘ దేశ్ కా స్మార్ట్‌ఫోన్’ పేరుతో‘ రెడ్ మీ ఎ5’ ను మార్కెట్లోకి విడుదల చేసింది.  అలాగే స్మార్ట్‌ఫోన్ చరిత్రలో  షియోమీ ఇండియాలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఐ వినియోగదారులకు బహుమతి రూపంలో రూ. 500 కోట్లు వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకుంది.  అందులో భాగంగా రెడ్ మీ 5ఎ తొలి 50లక్షల ఫోన్లను రూ. 4,999కే ఇవ్వనున్నట్టు తెలిపింది కంపెనీ..  రెడ్  మీ ఎ5 అసలు ధర రూ. 5,999.కాగా దేశ్ కా స్మార్ట్ ఫోన్ ద్వారా రూ. 4,99లకు లభించనుంది.ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్డు ద్వారా కొనుగులు చేసుకోవచ్చు.‘రెడ్ మీఎ5 ’ఫీచర్లు…..

5 అంగుళాల డిస్‌ప్లే

స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్

2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్

128 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్

13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా

ఆండ్రాయిడ్ నోగట్, ఎంఐయూఐ 9 వెర్షన్,

3000 ఎంఏహెచ్ బ్యాటరీ డ్యూయల్ స్లిమ్ స్లాట్, ఎస్డీ కార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్ ఉన్నాయి.