షియోమీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు - MicTv.in - Telugu News
mictv telugu

షియోమీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

December 7, 2017

ప్రముఖ చైనా మెుబైల్ దిగ్గజ సంస్థ షియోమీ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు ‘రెడ్ మీ 5’, ‘రెడ్ మీ5 ప్లస్’ బయటికొచ్చాయి. వీటిని గురువారం  చైనా మార్కెట్‌లో విడుదల చేశారు. ఈ ఫోన్లు భారత్‌లో త్వరలోనే  విడుదల కానున్నాయి. 2/3జీబీ ర్యామ్ 16/32 బీజీ స్టోరేజ్ వేరియంట్లలో లభించనున్నాయి.  వీటి ధరలు వరుసగా రెడ్ మీ5 రూ. 7,795, రూ.8,770  లభించనుండగా, 3/4జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైన రెడ్ మీ5 ప్లస్ రూ. 9,745, రూ. 12,675 లభించనున్నాయి.

షియోమీ‘ రెడ్‌మీ 5’ ఫీచర్లు…

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్  

2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్

128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్

12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్

4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

షియోమీ‘ రెడ్‌మీ 5 ప్లస్’ ఫీచర్లు…

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్

2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్

128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్

12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్

4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వై ఫై, బ్లూ టూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.