‘రెడ్ మీ 5’..స్లిమ్‌గా,బెటర్ ఫీచర్లతో, బెస్ట్ ఆఫర్లతో ! - MicTv.in - Telugu News
mictv telugu

‘రెడ్ మీ 5’..స్లిమ్‌గా,బెటర్ ఫీచర్లతో, బెస్ట్ ఆఫర్లతో !

March 14, 2018

ప్రముఖ చైనా మొబైల్ సంస్థ షియోమీ తన కొత్త స్మార్ట్ ఫోన్ ‘రెడ్ మీ5’ ను విడుదల చేసింది. ఈ ఫోన్ భారీ వ్యూ హెచ్ డీ డిస్ ప్లేను కలిగి ఉంది.  అలాగే ముందు భాగంలో సెల్పీ కెమెరాకు ప్లాష్ ఉంది. రెడ్ మీ 4 కన్నా 11శాతం తక్కువ స్లీమ్ బాడీని ఈ ఫోన్ కల్గి ఉంది. ఈ ఫోన్ 2/3/4జీబీ ర్యామ్,6/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఉంది.దీని ధరలు వరుసగా రూ. 7,999,రూ.8,999,రూ, 10,999 గా ఉన్నాయి.  ఈ నెల 20వ తేదీ నుంచి ఎంఐ ఆన్ లైన్ స్టోర్ ,ఎంఐ హోమ్ స్టార్ ,అమోజాన్ సైట్ లలో లభించనున్నాయి. ఈ ఫోన్‌ను కొన్న వారికి జియో ఫుట్‌బాల్ ఆఫర్ కింద రూ.2200 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తోపాటు 100 జీబీ అదనపు మొబైల్ డేటాను ఉచితంగా అందిస్తున్నారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొంటే 5 శాతం క్యాష్‌ బ్యాక్ వస్తుంది.

రెడ్‌మీ 5’ఫీచర్లు…

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్

2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే

720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్

2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్)

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్)

3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.