షియోమి నుంచి ల్యాప్ టాప్ - MicTv.in - Telugu News
mictv telugu

షియోమి నుంచి ల్యాప్ టాప్

September 11, 2017

షియోమి తన నూతన ఎంఐ మిక్స్2, నోట్ బుక్ 2, నోట్ బుక్ 3 వేరియేషన్లలో  ప్రో ల్యాప్ ట్యాప్ ను విడుదల చేసింది.  ఈ మూడింటిలో ఒకే ఫీచర్లు ఉన్నాయి. 15. 6 అంగుళాల డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ , 8వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ ప్రాపెపర్ తో  వీటిని పరిచయం చేసింది.

ఫీచర్లు…

డ్యుయల్‌ కూలింగ్‌ సిస్టం , టచ్‌ప్యాడ్‌ విత్‌ ఫింగర్‌ పింట్‌ సెన్సార్‌, మెగ్నీషియం అలోయ్‌  ఫ్రేమ్ డాల్బీ అట్మోస్  ఇతర ఫీచర్లుగా నిలవనున్నాయి.

అలాగే ఆపిల్ మ్యాక్‌ బుక్‌ ప్రో  కీబోర్డుతో  పోలిస్తే 19 శాతం పెద్దదైన బ్యాక్‌లిట్‌ కీబోర్డు దీని సొంతం . అలాగే16జీబీ ర్యామ్‌, ఫాస్ట్‌చార్జింగ్‌ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. కోర్ ఐ7,  8 జీబీ మోడల్‌ ధర రూ. 68,700 గాను,    ఇంటెల్‌ కోర్‌ ఐ5  8 జీబీ ర్యామ్‌ మోడల్‌ ధర రూ.62,800గాను,    ఇంటెల్‌ కోర్ ఐ7 16జీబీ   రూ.54,900గాను  ఉండనుంది.   త్వరలో  చైనాలో విక్రయాలు మొదలుకానున్నాయి.  ఇతర మార్కెట్లలో అందుబాటుపై   అధికారిక  ప్రకటన  ఏమీ రాలేదు.