యాదాద్రి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..3 కోట్ల నష్టం

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) గోదాంలో ఈ రోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది.  రాజపేటలో మార్కెట్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడ్డాయి.. స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెస్తున్నారు.

విద్యుత్ షార్టు స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు అంటుకున్నాయ‌ని చెబుతున్నారు. స్థానికులు కొన్ని ధాన్యం బ‌స్తాల‌ను బ‌య‌టకు తెచ్చారు. వేపగింజలు మూటలు కాలిపోయాయని , రూ. 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.