mictv telugu

వృద్ధజంట గొప్ప మనసు.. కోట్ల విలువైన ఆశ్రమం ప్రభుత్వానికి..

January 10, 2019

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వృద్ధ దంపతులు పెద్దమనసు చాటుకున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే వృద్ధాశ్రమానికి ప్రభుత్వానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో ఈ ఆశ్రమం ఉంది

Yadadri bhuvanagiri district old age couple satyanarayana reddy janakamma donates valuable old age shelter home to Telangana government.

మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జానకమ్మ దంపతులు వారి పేర్లతోవానప్రస్థాశ్రమాన్ని నిర్మించారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్‌ను వారు కలిసి వివరాలు అందించారు. ఎకరంన్నర భూమిలో, ఆరు వేల చదరపు అడుగుల భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించామని, అనారోగ్యం వల్ల భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వపరం చేస్తామని, అక్కడి వృద్ధులకు సేవలు కొనసాగేలా చూడాలని కేటీఆర్ ని కోరారు. ఆ  దంపతుల సేవా దృక్పథాన్ని, దాతృత్వాన్ని కేటీఆర్ కొనియాడారు.ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో మాట్లాడతారని, ఆశ్రమ నిర్వహణకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చూస్తామని టీఆర్ఎస్ పార్టీ నేత హామీ ఇచ్చారు. తర్వాత ఆయన ఆయన కలెక్టర్ అనితారామచంద్రన్‌తోనూ మాట్లాడారు. Telugu news Yadadri bhuvanagiri district old age couple satyanarayana reddy janakamma donates valuable old age shelter home to Telangana government TRS Leader KTR praised