యమహా ఇండియా కొత్త బైక్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. ఈ బైక్ కు పాత యమహా ఎప్ జఢ్ 25 కి దగ్గరి పోలికలున్నా.. కాస్త మెరుగుపరచి మార్కెట్ లోకి తీసుకువచ్చారు. ఈ కొత్త యమహా బైక్ స్పోర్ట్స్ లుక్స్ తో ‘ఫేజర్ 250’ గా యమహా లాంఛనంగా విడుదల చేసింది. బైక్ అక్టోబర్ లో అధికారికంగా విడుదల చేయనున్నారు. స్ప్లిట్ సీట్లు, అల్లాయ్ చక్రాలు, డిస్క్ బ్రేక్‌లు, ఎల్ఈడీ టెయిల్ లెట్స్, రియర్ అండ్ వైడర్ ట్యూబ్‌లెస్ టైర్లు, 249సీసీ సింగిల్ సిలిండర్, 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ 20ఎంఎం గరిష్ట టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డైమండ్ ఫ్రేమ్ చట్రం, స్పీడోమీటర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ను కూడా అమర్చిన ఈ యమహా ఫేజెర్ 250 డబుల్ టోన్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ముంబైలో దీని ధరను రూ .1,28,335( ఎక్స్ షో రూం) ఢిల్లీ రూ .1,29,335( ఎక్స్ షో రూం) గా ను నిర్ణయించింది. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200, హోండా సీబీఆర్, కేటీఎం ఆర్సీ 200 మహీంద్రా మోజో, కవాసాకి జెడ్ 250, రాబోయే టీవీఎస్ అపాచే 310 వంటి వాటికి యమహా గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.