‘యాత్ర’.. వైఎస్సార్‌గా మమ్ముట్టి ఇలా..! - MicTv.in - Telugu News
mictv telugu

‘యాత్ర’.. వైఎస్సార్‌గా మమ్ముట్టి ఇలా..!

April 7, 2018

మలయాళ నటుడు మమ్ముట్టి వైఎస్సార్ బయోపిక్‌లో నటిస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నాడనే వార్తలు వినిపించాయి. తాజాగా ఆ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల అయింది. ఈ సినిమా పేరు ‘ యాత్ర ’ గా పేర్కొంటూ మమ్ముట్టి తన ఫేస్‌బుక్ పేజీలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఈ సినిమాలో వైఎస్ఆర్ గెటప్‌లో మమ్ముట్టి కనిపించే  ఫస్ట్‌లుక్‌ చాలా మందిని ఆకర్షిస్తోంది. మమ్ముట్టి వైెఎస్ పాత్రలో ఒదిగిపోయారని.. ఆయనను చూస్తుంటే వైఎస్‌ను చూసినట్టుగానే వుందని కామెంట్లు చేస్తున్నారు. మహీ వీ రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్ తొమ్మిది నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశిలు ఈ సినిమాకు నిర్మాతలు.