చంద్రబాబుకు వాయినం పంపిన వైసీపీ - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబుకు వాయినం పంపిన వైసీపీ

April 14, 2018

‘ ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైసీపీ మాత్రమే. చంద్రబాబు చేతకాని తనంతో రాష్ట్రానికి హోదా రావట్లేదు. అందుకే ఆయనకు ఈ వాయినం ’ అంటూ వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు, పసుపు, కుంకుమలు పంపారు. అనంతపురం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని టవర్ క్లాక్ నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి…చీర, గాజులు, పసుపు, కుంకుమను పోస్ట్ బాక్సులో వేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అన్నారు. ఈ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఇంకా హోదా రావటంలేదని అన్నారు.