చంపి పాతేస్తా.. అంటున్న విజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

చంపి పాతేస్తా.. అంటున్న విజయ్

March 1, 2018

‘అర్జున్ రెడ్డి ’ చిత్రం భారీ విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అతని సినిమాలపై  అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  విజయ్ నటించిన తాజా చిత్రం ‘ఏ మంత్రం వేసావే’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది.

ఇందులో విజయ్  న్యూ స్టైల్‌లో కనిపించాడు.దాంతో ట్రైలర్‌ను చూసిన అభిమానుల్లో ఆసక్తి పెచ్చరిల్లింది.  ఈ చిత్రానికి మర్రి శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను గోలీసోడా ఫిలింస్ ప్రొడక్షన్ బ్యానర్  నిర్మిస్తోంది.ఈ చిత్రంలో హీరోయిన్‌గా శివాని సింగ్ నటిస్తోంది. మార్చి9 న ఈ సినిమా విడుదల కానుంది.