జొన్నరొట్టె కోసం ఎర్రబెల్లి ఆరాటం - MicTv.in - Telugu News
mictv telugu

జొన్నరొట్టె కోసం ఎర్రబెల్లి ఆరాటం

December 12, 2017

పాలకుర్తి ఎమ్మెల్యే  ఎర్రబెల్లి దయాకర్ రావ్ వరంగల్ జిల్లా కొత్తూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టే స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. అయితే ఈసందర్భంగా రోడ్డుపై పొలానికి వెళుతున్న గిరిజన కూలీలు ఆయనకు కనిపించారు.

 అయితే కారు ఆపి మరీ..ఒక్క నిమిషం ఆగండమ్మా అంటూ  వారి బాగోగులు అడిగి వాళ్ల దగ్గరున్న సద్దన్నాన్ని  ఎంతో ఇష్టంతో తిన్నారు. అంతేకాదు ‘సద్దన్నం సరే గాని జొన్నరొట్టె లేదా అమ్మా..నాకు జొన్న రొట్టె కావాలె’  అని అడిగాడు.

దానికి వారు ‘అయ్యో మీరస్తరని మాకు తెల్వది గద సారు, మా ఇంటికి రండి జొన్నరొట్టెతో పాటు ఆకుకూర తిందురు’ అని చెప్పారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి సద్దన్నం చాలా బాగుందంటూ ఎర్రబెల్లి అక్కడినుంచి వెళ్లిపోయారు.