యోగా పోరడు.. లక్షలు సంపాదిస్తున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

యోగా పోరడు.. లక్షలు సంపాదిస్తున్నాడు..

February 7, 2018

యోగా ఆ బాలుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆటిజం(బుద్ధిమాంద్యం) నుంచి బయటపడటానికి ఆ బాలుడు ఎంచుకున్న మార్గం యోగా. చైనాకు చెందిన ఏడేళ్ళ  సున్‌ చుయాంగ్‌ యోగాలో కఠోర సాధన చేసి అనారోగ్యం నుంచి బయట పడ్డాడు. ఝెజియాంగ్‌ ప్రావిన్స్‌లోని తైఝౌకు చెందిన సున్ చుయాంగ్‌కు రెండేళ్ళప్పుడు ఆటిజం ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. దాన్నుంచి బయట పడాలంటే యోగానే ప్రత్యాన్మాయమని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు బాలుడి తల్లిదండ్రులు అతణ్ణి యోగా క్లాసులకు పంపడం ప్రారంభించారు.అలా సున్ చుయాంగ్ యోగాపై మక్కువ పెంచుకున్నాడు. ఏడాదిలో తన ఒంట్లో వున్న అనారోగ్యాన్ని తరిమి కొట్టాడు. అంతటితో ఆపకుండా సాధన చేస్తూనే వున్నాడు. అత్యంత పిన్న వయసులో యోగా టీచర్‌గా మారి చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. సున్‌ ప్రస్తుతం టీవీ షోల్లో పాల్గొంటున్నాడు. మూడు సినిమాల్లోనూ నటించాడు. ఇప్పటి వరకు అతడు రూ.10 లక్షలు సంపాదించాడని తల్లిదండ్రులు సంబరపడుతున్నారు.