హత్య కేసులో ముఖ్యమంత్రికి నోటీసు - MicTv.in - Telugu News
mictv telugu

హత్య కేసులో ముఖ్యమంత్రికి నోటీసు

September 25, 2018

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మహారాజ్ గంజ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జరిగిన సమాజ్ వాదీ పార్టీ నేత తలజ్ అజీజ్ వద్ద భద్రతాధికారి సత్య ప్రకాశ్ యాదవ్ హత్య కేసులో హైకోర్టు ఆదేశాలు మేరకు ఈ నోటీసులిచ్చింది. 1999‌లో మహారాజ్ గంజ్ జిల్లాలో నిర్వహించిన ధర్నాలో సత్యప్రకాశ్ హత్య జరిగింది. యోగి నేతృత్వంలోనే కార్యకర్తలు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Rahul mocks Modi by seeing up downside in Rafale jet fighters contract says no response from Prime minister..

ఈ కేసు విచారణను ప్రారంభించాలని కోరుతూ అజీజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతడు ఉత్తరప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మహరాజ్‌గంజ్ కోర్టు ఈ కేసులో యోగి ఆదిత్య‌నాథ్‌కు నోటీసులు పంపించింది. అంతేకాదు యోగి తన వాదన వినిపించేందుకు కోర్టు వారం రోజులు సమయం కూడా ఇచ్చింది.