’తాజ్‌మహల్’ దగ్గర  యోగి ‘స్వచ్ఛ భారత్’   - MicTv.in - Telugu News
mictv telugu

’తాజ్‌మహల్’ దగ్గర  యోగి ‘స్వచ్ఛ భారత్’  

October 26, 2017

‘తాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మహల్‌’పై వివాదాలు ముదురుతున్న  నేపథ్యంలో, ఈ రోజు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రాను సందర్శించారు.  ఈ సందర్బంగా ఆయన ‘తాజ్‌మహల్’ వెస్ట్రన్ గేటు వద్ద  రోడ్డును ఊడ్చారు. స్వచ్చ భారత్‌లో భాగంగా  సీఎం యోగితో పాటు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఆగ్రాను పర్యాటక కేంద్రగా అభివృద్ది చేయడంకోసం యోగి  రూ.370 కోట్లను మంజురు చేశారు. ‘తాజ్‌మహల్’ నుంచి ఆగ్రా వరకు వేయనున్న రోడ్డు కోసం ఆయన శంకుస్థాపన చేసారు. బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి  ‘తాజ్‌మహల్’ను సందర్శించడం  ఇదే తొలిసారి.

ఉత్తరప్రదేశ్ విడుదల చేసిన పర్యాటక బ్రౌచర్‌లో ‘తాజ్‌మహల్‘ గురించి ప్రస్తావన లేకపోవడం వివాదస్పదమైంది. దానికి తోడు బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్, తాజ్‌మహల్‌ను  దేశ ద్రోహులు నిర్మించారని ఆరోపణలు చేశారు. కానీ సీఎం యోగి మాత్రం ‘తాజ్‌మహల్’  ఓ అద్బుత కట్టడమని, ఈకట్టడం దేశానికే గర్వ కారణమని కొనియాడారు.