యోగీ.. ఇదేం పరాచికం స్వామీ !  - MicTv.in - Telugu News
mictv telugu

యోగీ.. ఇదేం పరాచికం స్వామీ ! 

September 12, 2017

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఆవులన్నా, కోతులన్నా తెగ ఇష్టమని మనకు తెలుసు. పాపం.. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దేశానికి ఇంత తిండిపెట్టే రైతులు మాత్రం ఆయన కంటికి ఆనడం లేదు. ఇటీవల హమీర్ పూర్ లోని రైతులకు యోగి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఎంతో తెలిస్తే మీరు షాక్ తింటారు.  ఉమ్రి గ్రాామానికి చెందిన శాంతి దేవి అనే మహిళా రైతుకు కేవలం 10 రూపాయల 37 పైసల రుణాన్ని రద్దు చేశారు. ఆమె బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పేమో రూ. 1.55 లక్షలు.. ! అలాగే మౌదాహ గ్రామానికి చెందిన మున్నిలాల్ అనే రైతుకు రూ. 40,000 అప్పుకు గాను రూ. 215 మాఫీ చేశాడు. నామమాత్రం అని కూడా చెప్పడానికి వీల్లేని ఇలాంటి  రుణమాఫీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రైతులో పరాచికాాలా? ఏం మనిషివయ్యా నువ్వు..’ అని ధ్వజమెత్తుతున్నారు.  కృషి రుణ మోచన్ యోజన ‘ పథకం కింద యోగి ప్రభుత్వం 87 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.

ఆమె బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పేమో రూ. 1.55 లక్షలు.. ! అలాగే మౌదాహ గ్రామానికి చెందిన మున్నిలాల్ అనే రైతుకు రూ. 40,000 అప్పుకు గాను రూ. 215 మాఫీ చేశాడు. నామమాత్రం అని కూడా చెప్పడానికి వీల్లేని ఇలాంటి  రుణమాఫీపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రైతులో పరాచికాాలా? ఏం మనిషివయ్యా నువ్వు..’ అని ధ్వజమెత్తుతున్నారు.  కృషి రుణ మోచన్ యోజన ‘ పథకం కింద యోగి ప్రభుత్వం 87 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.