భర్త ప్రాణాలు కాపాడుకున్న నువ్వు సూపరమ్మా - MicTv.in - Telugu News
mictv telugu

భర్త ప్రాణాలు కాపాడుకున్న నువ్వు సూపరమ్మా

February 5, 2018

తన ప్రాణాలు అడ్డు పెట్టి భర్త ప్రాణాలు కాపాడుకున్నది మహా సాథ్వి సతీ సావిత్రి. ఈ నేటి సావిత్రి కూడా భర్త ప్రాణాలకు కాపాడుకోవటానికి సాహసం చేసింది. ఆమె చేసిన సాహసం చాలా మందిని ఆకట్టుకుంటున్నది. ఇంటి గేటు ముందు నిలబడ్డ భర్త మీదకు అకస్మాత్తుగా వచ్చిన దుండగులు దాడి చేస్తుండగా, ఇంటి లోపలున్న భార్య రివాల్వర్ తెచ్చి వారిని బెదిరించి భర్త ప్రాణాలు కాపాడుకున్నది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా కకోరీలో చోటు చేసుకుంది. ఇంటి గేటు ముందు నిలబడ్డాడు భర్త. భార్య ఇంట్లో పని చేసుకొంటోంది. ఇంతలో నలుగురైదుగురు అగంతకులు అతని మీద దాడికి దిగారు. కర్రలతో కొడుతున్నారు.

భర్త అరుపులు విన్న భార్య మనసు కీడు శంకించింది. వెంటనే రివాల్వర్ తీసుకొని బయటకు వచ్చింది.             ‘ మర్యాదగా నా భర్తను వదిలేస్తారా లేదా.. లేకపోతే ఒక్కొక్కరిని కాల్చి చంపేస్తా ’ అని రివాల్వర్‌ను వారికి గురి పెట్టి బెదిరించింది. దెబ్బకు ఆమె భర్తను వదిలేసి తుర్రుమన్నారు దుండగులు. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇంటి ఆవరణలో వున్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందుతులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా మహిళ చూపిన చొరవకు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతున్నది.