మగవాళ్లపైనా అత్యాచారాలు..బాలీవుడ్ లీలలు!

సినిమా..అదో రంగుల ప్రపంచం. అందులో అడుగుపెట్టాలని  ఎందరెందరో ఎన్నో కలలు కంటారు. దానికోసం ఏదైనా వదులు కోవడానికి సిద్దపడతారు. వాళ్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని  కొందరు సీనీ పెద్దలు వారిని పడకగదికి రమ్మంటారు. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని ఈ మధ్య మనం చాలా వార్తలు చూశాం. అయితే లైంగిక వేధింపులు కేవలం ఆడవాళ్లకే కాదు. మగవాళ్లకు కూడా అని అంటున్నాడు దర్శక నిర్మాత వివేక్ అగ్ని హోత్రి.  

అతని బంధువు ఒకరు  సినిమాల్లో నటించాలని  అమెరికా నుంచి వచ్చాడట. ..అతన్ని వివేక్   కొందరి దర్శక నిర్మాతకు పరిచయం చేశాడు..వాళ్లు అతన్ని లైంగికంగా వేధించారని  వివేక్ తన ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశాడు. బాలీవుడ్‌లో అవకాశం రావాలంటే మూడు తప్పని సరి. లైంగిక వేధింపులు, డబ్బు, అధికారం ఇందకులో ఏ ఒక్కట్టైనా లేకున్నా  ఎవ్వరికి అవకాశాలు రావు.

అవకాశాల కోసం కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాతలకు , దర్శకులకు, హీరోలకు లొంగి పోతున్నారు. తవ్వితే ఎంతో మంది జీవితాలు బయట పడతాయి. వాళ్లందరి గుట్టు బయట పెట్టాలంటే చాలా మంది కంగనా రనౌత్ లు ముందుకు రావాలి. ‘మీ టూ’ ఉద్యమం కేవలం మహిళలకే కాదు. పురుషులు కూడా ఉండాలి అని ఆయన స్పష్టం చేశారు..  ఇప్పుడు ఈ ట్వీట్ బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.