ఆరేళ్ల పోరడు.. 71 కోట్లు సంపాదించాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆరేళ్ల పోరడు.. 71 కోట్లు సంపాదించాడు..

December 12, 2017

సృజనాత్మకత ఉండాలే కాని , ఏ విధంగానైనా డబ్బు సంపాదించవచ్చు. యూట్యూబ్‌లో  కొందరు తమ తెలివితేటలను ఉపయోగించి చాలా సంపాందిస్తున్నారు. కానీ ర్యాన్ మాత్రం చాలా ప్రత్యేకం.  ఎందుకంటే అతని వయస్సు ఆరేళ్లే. కానీ సంపాందన మాత్రం ఏడాదికి 11 మిలియన్ డాలర్లు (రూ. 71 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఫోర్బ్స్  మేగజైన్ ప్రకారం 2017లో అత్యధిక సంపాందిస్తున్న యూ ట్యూర్ల జాబితాలో ర్యాన్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
అసలు ర్యాన్ యూట్యూబ్‌లో ఏం చేస్తాడు? ఏమీ చేయడు.. ఆడుకుంటాడు.. అంతే. తన ‘ ర్యాన్ టాయ్స్ రివ్యూ’ ఛానల్  ద్వారా కొత్త కొత్త ఆట బొమ్మలకు రివ్యూలు రాస్తుంటాడు. అందుకు తన తల్లిదండ్రులు ర్యాన్‌కి సాయం చేస్తారు. మార్చి 2015 నుంచి  ర్యాన్ వీడియోలు పెడుతూ వచ్చాడు. కానీ పెద్దగా ఎవరూ  చూడలేదు. కానీ జూలైలో తాను పెట్టిన ‘కార్స్ జెయింట్ బాల్‌’ బొమ్మ వీడియో వైర‌ల్‌గా మారింది.  అప్పటి నుంచి ర్యాన్‌కు సబ్‌స్క్రైబర్లు పెరుగుతూనే వచ్చారు. ప్రస్తుతం ర్యాన్ ఛానల్‌కు 10 మిలియన్లు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కార్స్ జెయింట్ బాల్ వీడియోకి ఇప్ప‌టి వ‌ర‌కు 801 మిలియ‌న్ల వ్యూస్  వ‌చ్చాయి. ఈ ఛాన‌ల్ ద్వారా ర్యాన్‌కి నెల‌కు 1 మిలియ‌న్ డాల‌ర్ల సంపాద‌న అందుతోంది. అయితే ర్యాన్ ర‌క్ష‌ణ‌, వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త దృష్ట్యా అత‌ని త‌ల్లిదండ్రులు పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించడానికి నిరాక‌రించారు.