సచివాలయం సాక్షిగా ఘోరం జరుగుతుండె! - MicTv.in - Telugu News
mictv telugu

సచివాలయం సాక్షిగా ఘోరం జరుగుతుండె!

February 10, 2018

అధికారుల నిర్లక్ష్యానికి సచివాలయమే సాక్ష్యమయ్యింది. అధికారులు చేసిన పనికి ఓ యువకుడికి  చావు తప్పి కళ్లు లొట్టపడ్డ పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా భూగర్భ పైప్ లైన్ కోసం అధికారులు కొన్ని రోజుల కిందట రోడ్డు పక్కన పెద్ద గోతి తవ్వారు. పనులు ఆలస్యం అవడంతో ఆ గోతిని అలాగే ఉంచారు. బైక్‌పై వస్తున్న ఓ యువకుడు అది గమనించకుండా ఒక్కసారిగా దాంట్లో పడ్డాడు.

ఆ గొయ్యి 20 అడుగులలోతు ఉండడంతో అంతా చీకటిగా ఉంది. ఆ యువకుడు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతన్ని బైటికి తీశారు. ఇంకా నయ్యం ఆ యువకుడి నెత్తికి హెల్మెట్ ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే సచివాలయం సాక్షిగా అతను బలైపోతుండే. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని స్థానికులు మండిపడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్దులు తిరిగే ప్రాంతాల్లో ఇలా ఇంత పెద్ద గోతులను తవ్వి అలా వదిలేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.