ఓటేస్తూ సెల్ఫీ.. రాజేంద్రనగర్‌లో యువకుడి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఓటేస్తూ సెల్ఫీ.. రాజేంద్రనగర్‌లో యువకుడి అరెస్ట్

December 7, 2018

ఎన్ని ఘటనలు జరిగినా.. సెల్ఫీ పిచ్చోళ్ల పైత్యం మారడం లేదు. పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫొన్లు నిషేధమని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఓటు వేసేటప్పుడు గోప్యత పాటించాలని, ఫొటో తీసినా, సెల్ఫీ దిగినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కూడా హెచ్చరించారు. అయినా అత్యుత్యాహం ప్రదర్శించాడు ఓ యువకుడు. చివరకు పోలీసులకు చిక్కి చిక్కుల్లో పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు ఉప్పర్‌పల్లికి చెందిన శివశంకర్‌గా గుర్తించారు.కాగా పోలింగ్ కేంద్రాలకు ఫోన్లతో వచ్చిన ఓటర్లు వారిని అనుమతించకపోవడంతో వారి తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నారు. పోలింగ్ కేంద్రాల బయట మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేసి వెళ్లేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. దీంతో  ఓటర్లు అసహానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్లు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.జ బంజారాహిల్స్ పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్ ఛైర్లను అందుబాటులో ఉంచకపోవడంతో వారు ఓటేసేందుకు వచ్చి అవస్థలు పడుతున్నారు.