పిల్లల ముందు సిగరెట్,మందు, గిల్లికజ్జాలు వద్దే వద్దు - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లల ముందు సిగరెట్,మందు, గిల్లికజ్జాలు వద్దే వద్దు

November 21, 2017

మీరు పిల్లల ముందు సిగరెట్ కాలుస్తున్నారా? మీ పిల్లల ముందు మందు పార్టీలు జరుపుకుంటున్నారా? మీ ఆఫీసులో చేసే మతలబుల గురించి పిల్లల ముందు మాట్లాడుతున్నారా? భార్యా భర్తలు తరచూ పిల్లల ముందు గొడవ పడుతున్నారా? అయితే ఇవన్నీ మీ పిల్లలమీద చెరగని ముద్ర వేస్తాయి.  వారి జీవనవిధానం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వారి దురలవాట్లకు మీరే కారణం అవుతారు. మేం చెప్పేది, ఏదో కల్పిత కథ కాదు, ఈ మధ్యే ఓ సర్వేలో వెలువడ్డ పచ్చినిజం.చిన్నప్పుడు పిల్లలు మనం ఏది చేస్తే అది చేస్తున్నారని, మురిసిపోతాం,కాని వారు ఎదుగుతున్నా కొద్ది మీరు చేసే ప్రతిపనిని ఫాలో అయితే మాత్రం  అవి మీపిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మంచి అలావాట్లైతే పర్వాలేదు, కానీ మీ పిల్లల దురలవాట్లకు మీరు కారణం కాకుండా చూసుకోండి. ఇంగ్లాండ్‌లోని లీడ్స్ యూనివర్సిటీ వారు 21000 మంది తల్లిదండ్రులపై చేసిన సర్వేలో తొంబై శాతం వాళ్ల పిల్లల దురలవాట్లకు  వారే కారణమని తేలింది. అంతేకాదు బుద్దిపరంగా,శక్తి పరంగా పిల్లలకు తల్లిదండ్రుల నుంచే అన్ని అలవాట్లు సంక్రమిస్తాయి, అందుకే  తల్లిదండ్రులు యుక్తవయసులో ఉన్నప్పుడు మందు, సిగరెట్ వగైరా లాంటి అలవాట్లు ఉంటే, ఆ తర్వాత వారి పిల్లలకు కూడా సంక్రమిస్తాయని  యూనివర్సిటీ వాళ్ల సర్వేలో తేలింది. అందుకే కావచ్చు మనం పిల్లల్లోని కొన్ని అలవాట్లను చూసి ఎన్కట మీతాత ఇట్లనే ఉండే, మీ నాయ్న ఇట్లనే ఉంటే అని తిడుతుంటాం. కావున మీరు ఏం చేసినా, ఏ దురలవాట్లకు బానిస అయినా కూడా అవి మీ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మరచిపోకండి.