mictv telugu

గాలిలో తేలినట్టుందే.. శానిటరీ ప్యాడ్లను ఉడకబెట్టుకుని తాగేస్తున్నారు..  

November 14, 2018

లోకో భిన్న రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్లు.. ఎవరి టేస్ట్ వారిది. ఎవరి గ‘మ్మత్తు’ వారిది.  శానిటరీ పాడ్లను టేస్ట్ చేసేవాళ్లూ బయల్దేరారు. ఇండోనేషియాలో ఈ పోకడ పెచ్చరిల్లుతోంది. వాటిని వేడినీటిలో వాడిన, కొత్త శానిటరీ ప్యాడ్లను గంటపాటు ఉడకబెట్టుని ఆ నీటిని జుర్రుకుంటున్నారు. ఈ దరిద్రగొట్టు ఔషధం ఒంటికి మంచిది కాదని అధికారులు మొత్తుకుంటున్నా వినడం లేదు.

Telugu news  Youths are boiling sanitary pads to get high in Indonesia... creating hallucinogenic drink that makes them feel as if they are flying, officials war

రాజధాని జాకార్తాతోపాటు పలు ప్రాంతాల్లో యువత ఈ నీటిని తాగుతున్నారు. అది తాగితే ‘గాలిలో తేలినట్లు’ ఉంటుందని, ఎవోవో కలలు, భ్రమలు వస్తాయని చెబుతున్నారు. శానిటరీ ప్యాడ్లలోని రసాయనాల వల్ల ఈ ప్రభావం ఉంటుందని, ఈ అలవాటు చాలా ప్రమాదకరమని జాతీయ డ్రగ్ ఏజెన్సీ హెచ్చరిస్తోంది. ఈ ‘దివ్యౌషధాన్న’ తానే కనిపెట్టానని 14 ఏళ్ల కుర్రాడు చెబుతున్నాడు. ‘ప్యాడ్లను ఒక గంటపాటు బాగా మరగబెట్టాలి. తర్వాత దాన్ని ఆ గిన్నెలోనే పిండాలి. నీటిని చల్లార్చి తాగాలి..’ అని సలహా ఇస్తున్నాడు. ఇది కాస్త చేదుగా ఉన్నా, పొద్దున, రాత్రి తాగితే రెక్కలు కట్టుకుని ఎగిరపోతున్నట్లు ఉంటుందంటున్నాడు. ఈ గలీజ్ వ్యవహారంపై ప్రభుత్వం దర్యాప్తు మొదలుపెట్టింది.

Telugu news  Youths are boiling sanitary pads to get high in Indonesia… creating hallucinogenic drink that makes them feel as if they are flying, officials war