ఉగ్రవాదంపై దాడికి యూట్యూబ్‌లో  10వేల ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఉగ్రవాదంపై దాడికి యూట్యూబ్‌లో  10వేల ఉద్యోగాలు

December 5, 2017

యూట్యూబ్ భారీగా నియామకాలను చేపడుతోంది. హింసాత్మక  తీవ్రవాదాన్ని పర్యవేక్షించడం, నియంత్రించడం కోసం  దాదాపు 10వేల మందిని నియమించకోనున్నట్టు తెలిపింది. తమ టీమ్స్ అభివృద్దిని కొనసాగిస్తామని తెలిపింది. పాలసీలను ఉల్లంఘించే కంటెంట్‌ను గుర్తించేందుకు వచ్చే ఏడాదిలో 10వేల మందికి కొలువులు ఇస్తామని యూట్యూబ్‌‌ను నిర్వహిస్తున్న గూగుల్ తెలిపింది.  

వీడియో సైట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుసాన్ వోజ్సికి మాట్లాడుతూ…ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలను పరిశీలనకు యూట్యూబ్‌తో పాటు ఫేస్‌బుక్, గూగుల్,ట్వీటర్ అన్ని కలసి పనిచేస్తున్నాయన్నారు.

ఇటీవల బ్రిటన్‌లో ఎక్కువగా ఉగ్రవాద దాడులు జరిగాయి. దాంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఉగ్రవాద కంటెంట్‌ను తొలగించాలని బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మే ఆదేశించారు.  ఈ విషయాన్ని టెక్ కంపెనీలు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నాయి.

ఆన్‌లైన్ ఉగ్రవాదాన్ని తగ్గించేందుకు వేగవంతంగా పనిచేయాల్సి ఉందని మే చెప్పారు. కేవలం యువతకు పనికొచ్చే, అమోదయోగ్యమైన వీడియోలు ఉంచి, చెత్త వీడియోలను ,ఉగ్రవాదానికిసంబంధించిన వీడియోలను తమ ప్లాట్ ఫామ్  నుంచి తొలగిస్తున్నామని  యూట్యూబ్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జోహన్నా రైట్‌ తెలిపారు. 50 ఛానళ్లను, వేలకొద్దీ వీడియోలను యూట్యూబ్‌ తొలగించింది.