mictv telugu

నాకు ప్రభాస్‌కు ఎలాంటి సంబంధం లేదు.. షర్మిల ఫిర్యాదు

January 14, 2019

 తెరపైకి మళ్ళీ ప్రభాస్-షర్మిల వివాదం వచ్చింది. సోషల్‌ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర​ వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిల ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం షర్మిల, భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. వీరితో పాటు కమిషనర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.

Telugu News ys sharmila accusing tdp party for her character assassination in social media .

గతంలోలానే మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నా పరువు తీయడానికే ఇలా చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. అలాగే ప్రభాస్ అనే నటుడికి తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యక్తిని జీవితంలో ఎప్పుడూ కలవలేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పారు. ప్రభాస్ అనే వ్యక్తికి తనకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు రుజువు చేయగలరా? అని సవాల్ విసిరారు. పుకార్లు పుట్టించేవారికి, వారి వెనకాల ఉన్నవారికి సిగ్గు అనిపించడం లేదా? అని విరుచుకపడ్డారు. ఈ ప్రచారాల వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నానని తెలిపారు. వైఎస్ఆర్ ఫ్యాక్షనిస్ట్ అని గతంలో పుకార్లు పుట్టించారు. మా అన్న గర్విష్టి అని, కోపిష్టి అని పుకార్లు పుట్టించారు. కానీ అయన ఎంత సౌమ్యుడో ఈ పాదయాత్ర సందర్భంగా కోట్ల మందికి అర్థం అయిందని అన్నారు.

Telugu News ys sharmila accusing tdp party for her character assassination in social media