mictv telugu

షర్మిల వీడియోలను లైకుల కోసమే అప్‌లోడ్ చేశాం..

February 14, 2019

వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో రకరకాల వదంతులతో వీడియోలు పెట్టిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు వాసి పెద్దిశెట్టి వెంకటేష్‌, మంచిర్యాలకు చెందిన ఎ.నవీన్‌ను పోలీస్‌ అధికారులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్‌ చేశారు. వారిని విచారించిన పోలీసులు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. షర్మిలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, వీడియోలను చూసి.. తాము కూడా ఇలా చేస్తే ఎన్ని లైక్‌లు వస్తాయో తెలుసుకునేందుకు వీడియోలను పోస్ట్‌ చేశామంటూ నిందితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలిపారు.

Telugu news YS Sharmila videos uploaded for likes .

వారి నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు న్యాయస్థానం అనుమతితో మూడు రోజుల పాటు వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. తాను కొద్దినెలల క్రితం ఆరు వీడియోలను పోస్ట్‌ చేసినట్టు వెంకటేష్‌ చెప్పాడు.  రెండురోజుల్లో నాలుగు వీడియోలు అప్‌లోడ్‌ చేశానని నవీన్‌ తెలిపాడు. షర్మిలపై తమకు ఎలాంటి దురుద్దేశం లేదని, తాము రాజకీయ ప్రయోజనాల కోసం వీడియోలు యూట్యూబ్‌లో ఉంచలేదని నిందితులు పోలీసులకు వివరించారు.

వీరు అప్‌లోడ్‌ చేసిన ఫోటోలు, వీడియోల్లో ఉన్న సమాచారం ఎలా తీసుకున్నారన్న అంశంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే మరో రెండు యూట్యూబ్‌ ఛానెళ్లపై సైబర్‌ క్రైమ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రెండు ఛానెళ్లలో షర్మిల వ్యక్తిగత జీవితంపై వందకుపైగా వీడియోలను పోస్ట్‌చేశారు. ఆ ఛానెళ్ల ప్రతినిధులకు నోటీసులు పంపించామని పోలీసులు తెలిపారు. Telugu news YS Sharmila videos uploaded for likes