mictv telugu

కేసీఆర్ బాటలో జగన్.. రైతుబంధు, బీమా, జిల్లాలు..

January 9, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా, రైతు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు, నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వాలు ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టాయి. తాజాగా పొరుగు రాష్ట్ర ప్రధాన విపక్షం కూడా కేసీఆర్ బాట పట్టింది. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కీలక ప్రకటనలు చేశారు. ఏపీలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ఇచ్ఛాపురంలో ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తరహాలో  పలు పథకాలను అమలు చేస్తామని, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పారు.

జగన్ ప్రటించిన పథకాలు ఇవీ..

రైతుబంధు తరహాలో ఏపీ రైతులకు రైతు పెట్టుబడి పేరతో మే నెలలో 12,500 పెట్టుబడి సాయం

రైతు బీమా తరహాలో వైఎస్సార్ బీమా.. రైతు మరణిస్తే రూ. 5 లక్షల ఆర్థిక సాయం.. బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.

రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయం

మండలానికి ఒక శీతల గిడ్డంగి, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

రైతులకు ఉచిత బోర్లు

రైతులకు రోజుకు 9 గంటల పాటు ఉచిత కరెంటు

రైతులకు వడ్డీ లేని రుణాలు

ప్రతి గ్రామంలో పది మందికి గ్రామ పంచాయతీలో ఉద్యోగాలు

ప్రతి 50 మంది ప్రజలకు ఒక వలంటీర్.. రూ. 5 వేల గౌరవ వేతనం

25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలతో కొత్త ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తామని జగన్ మోహన్ రెడ్డి  ప్రకటించారు.

ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తామని, కలెక్టర్ల వ్యవస్థను ప్రజలకు దగ్గర చేస్తామని చెప్పారు. ‘గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తాం… ప్రతీ గ్రామంలో గ్రామ సచివాలయం తీసుకొస్తాం.. మీ గ్రామంలోనే యువతకు ఉద్యోగఅవకాశం ఇస్తామని ప్రకటించారు. ప్రతీ పథకం ప్రతీ పేదవాడి ఇంటికి వెళ్లేలా చేస్తాం’ అని హామీ ఇచ్చారు.Telugu news YSR congress Party leader YS Jagan Mohan Reddy announces rythu bandhu type schemes in andhra pradesh farmers following TRS leader KCR schemes and new stricts