రూ.4 కే భోజనం.. రోజా పెద్దమనసు - MicTv.in - Telugu News
mictv telugu

రూ.4 కే భోజనం.. రోజా పెద్దమనసు

November 20, 2018

నిరుపేదల ఆకలిని తీర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా సబ్సడీ ధరల క్యాంటీన్ ప్రారంభించారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ తరపున నగరిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ‘వైఎస్‌ఆర్ క్యాంటీన్’ను ఏర్పాటు చేశారు. మంగళవారం ఆమె ఆ క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పేదలకు స్వయంగా భోజనాన్ని అందించిన రోజా.. తన భర్త సెల్వమణితో కలిసి భోజనం కూడా చేశారు.

నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందిచాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. వైఎస్‌ఆర్ క్యాంటీన్లను అన్ని ప్రాంతాల్లో ప్రారంభించేదుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, సొంతగానే వైఎస్‌ఆర్ క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Telugu News Ysr Congress Party MLA Roja Started YSR CANTEEN At Nagari Constituency